Tuesday, April 22, 2014

జిల్లాల్లో పరిస్థితి ఇదీ . TDP & BJP = Telangana

ఖమ్మం: ఇక్కడి 10 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 9 చోట్ల, బీజేపీ ఒకచోట పోటీ చేస్తోంది. ఒక్కరికీ గెలుస్తామనే ధీమా లేదు. పాలేరు, కొత్తగూడెం అభ్యర్థులకు తుమ్మల వర్గం సహాయ నిరాకరణ చేస్తుండగా, తుమ్మలతో పాటు ఆయన వర్గీయులు పోటీచేస్తున్న 5 నియోజకవర్గాల్లో నామా వర్గం అదే రీతిలో ఉంది.  అశ్వారావుపేటలో ఎం. నాగేశ్వరరావు కొంత మేర పోటీ ఇస్తున్నా గెలుపుపై ధీమా లేదు. మధిరలో మోత్కుపల్లి నర్సింహులు ఎదురీదుతున్నారు.

మెదక్: జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టీడీపీ పోటీ చేస్తోంది. మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ రంగంలో ఉండడంతో టీడీపీ అభ్యర్థులకు  గెలుస్తామని ధీమాగా చెప్పే పరిస్థితి ఒక్కచోట కూడా లేదు.  బీజేపీ సహకారం ఏమాత్రం లేదు. పటాన్‌చెరులో టీడీపీ అభ్యర్థికి బీజేపీ రెబల్ అంజిరెడ్డి ప్రమాదకరంగా మారారు.

కరీంనగర్: 13 సెగ్మెంట్లలో  టీడీపీ 6 చోట్ల పోటీలో ఉంది. అన్ని చోట్ల త్రిముఖ, బహుముఖ పోటీ నెలకొంది. జగిత్యాల, పెద్దపల్లి, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు కొంత పోటీ ఇస్తున్నారు. మిగతా చోట్ల నామ్‌కే వాస్తే. చొప్పదండిలో జేఏసీ విద్యార్థి నేత మేడిపల్లి సత్యంకు చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడంతో పార్టీ పరిస్థితి కొద్దిగా మెరుగుపడినట్లు కనిపిస్తోంది.

వరంగల్: త్రిముఖ పోటీలో నామ్‌కేవాస్తేగా మారిపోయింది. మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్‌పూర్‌లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి, ములుగులో సీతక్క, పరకాలలో ధర్మారెడ్డి, నర్సంపేటలో రేవూరి ప్రకాశ్ రెడ్డి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.

 నిజామాబాద్: కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఇక్కడ టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 9 సీట్లకు గాను టీడీపీ 5 చోట్ల పోటీ చేస్తుండగా, బా ల్కొండలో మాత్రమే మల్లికార్జునరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డికి కొద్దిగా పోటీ ఇస్తున్నారు.

 అదిలాబాద్: జిల్లాలోని 10 సీట్లకుగాను టీడీపీ ఆరుచోట్ల పోటీ చేస్తోంది.  బోథ్‌లో సోయం బాబూరావు మాత్రమే పోటీ ఇస్తున్నారు. మిగతా అన్ని చోట్ల మూడోస్థానం కోసమే టీడీపీ పోటీ పడుతోంది.

నల్లగొండ: జిల్లాలోని 8 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీ దేవరకొండ, కోదాడ, భువనగిరి నియోజకవర్గాల్లో వూత్రమే ఓమోస్తరు పోటీలో ఉండగా, నల్లగొండ, నాగార్జున సాగర్, నకిరేకల్, సూర్యాపేటల్లో వుూడోస్థానం కోసం పోటీ పడుతోంది.
 

No comments:

Post a Comment