సవరించిన తుది ఓటర్ల జాబితా విడుదల :
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఈనెల 16 వరకూ సవరించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈవో కార్యాలయం గురువారం ప్రకటించింది. దీని ప్రకారం ఈ 13 జిల్లాల్లో మొత్తం 3,65,62,986 మంది ఓటర్ల ఉన్నారు. వీరిలో 1,83,88,867 మంది మహిళలు, 1,81,70,961 మంది పురుషులు, 3,158 మంది ఇతరులు (హిజ్రాలు) ఉన్నారు. అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. పురుషులతో పోల్చితే గుంటూరు జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య 52,130 ఎక్కువగా ఉంది. అనంతపురం జిల్లాలో మాత్రం మహిళల కంటే పురుష ఓటర్ల సంఖ్య 35,984 అధికంగా ఉంది.

No comments:
Post a Comment