కాంగ్రెస్ పార్టీ నుంచి కాకినాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న కేంద్ర
మానవవనరుల శాఖమంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ఉన్నత విద్యను అభ్యసించారు. ఏయూలో
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ చేసిన ఆయన యూఎస్‌ఏలోని
ఫిలోడెల్ఫియా టెంపుల్ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. కాకినాడ లోక్‌సభ
స్థానానికి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం బి.కామ్, ఐసీడబ్ల్యూఏ చేసి, వేర్
హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగిగా పనిచేసి 2004లో రాజకీయాల్లోకి వచ్చారు.
ఆయన రెండుసార్లు జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర స్టాంపులు
రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రిగా పనిచేశారు.
రాజమండ్రి కాంగ్రెస్ అభ్యర్థి కందుల దుర్గేష్ ఎంఏ చేశారు. రాజమండ్రి రూరల్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీచేస్తున్న వడ్డి మల్లిఖార్జునప్రసాద్ బి.ఎ, బిఎల్ చేసి న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
రాజమండ్రి కాంగ్రెస్ అభ్యర్థి కందుల దుర్గేష్ ఎంఏ చేశారు. రాజమండ్రి రూరల్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీచేస్తున్న వడ్డి మల్లిఖార్జునప్రసాద్ బి.ఎ, బిఎల్ చేసి న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
No comments:
Post a Comment