చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఎన్నో అడ్డంకులు
ఎదురవుతున్నా తెలంగాణాలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నికల్లో మహిళలకు సముచిత
స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఏడు జడ్పీ ఛైర్మన్ల
ఎన్నికల్లో నలుగురు మహిళలకు అవకాశం దక్కింది. స్థానిక సంస్థల్లో
రిజర్వేషన్ల కారణంగా తెలంగాణాలోని మెజార్టీ జిల్లాల్లో జడ్పీ ఛైర్ పర్సన్ల
స్థానాలు మహిళలకు సగానికి పైగా దక్కాయి.
రిజర్వేషన్లకు అనుగుణంగా సగం స్థానాలు కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలు మహిళలకు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా జనరల్ స్థానమే అయినా టీఆర్ఎస్ పార్టీ మహిళా నేతనే ఛైర్ పర్సన్ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆ పార్టీ తరపున కరీంగనర్ నుంచి -తుల ఉమ , ఆదిలాబాద్ -శోభారాణి, వరంగల్-గద్దల పద్మ, మెదక్-రాజమణి జడ్పీ చైర్ పర్సన్ లుగా ఎన్నికయ్యారు.
రంగారెడ్డి జడ్పీ ఎన్నిక 13 కి వాయిదా..
రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఈ నెల 13 కు వాయిదా పడడంతో రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డిని టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని నిర్ణయించింది.ఈ స్థానంపై ఉత్కంఠగా ఉన్నా ఖచ్చితంగా టీఆర్ఎస్ కే జడ్పీ పీఠం దక్కుతుందనే ధీమా నేతల్లో వ్యక్తం అవుతోంది.
మరోవైపు రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ జడ్పీటీసీగా విజయం సాధించిన జ్యోతి టీఆర్ఎస్ గూటికి చేరడంతో జిల్లా పరిషత్ లో పార్టీ బలం మరింత పెరిగింది. కాంగ్రెస్, టీడీపీ నుంచి మరికొంత మంది జడ్పీటీసీలు టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

No comments:
Post a Comment