Monday, July 7, 2014

Zilla Parishad Chairmans - Andhrapradesh

The Winners
Srikakulam: Chowdary Dhanalakshmi (TDP)
Vizianagaram: Sobha Swathi (TDP)
Visakhapatnam: Lalam Bhavani (TDP)
East Godavari: Naamala Rambabu (TDP)
West Godavari: Mullapudi Bapi Raju (TDP)
Kirshna: Gadde Anuradha (TDP)
Guntur: Sk Johnymoon (TDP)
Anantapur: Dudekula Chaman (TDP)
Kurnool: M Rajasekhar Goud (TDP)
Kadapa: Guduru Ravi (YSRC)
Chittoor: S Geermani (TDP)
Prakasam: Election postponed
Nellore: Election postponed

Elections Results

India

Party Lead Won
NDA 00 337
UPA 00 58
LEFT 00 10
Others 00 138

Telangana

Party Lead(MLA) Won(MLA) Lead(MP) Won(MP)
CONGRESS 21 02
TRS 63 11
TDP 15 01
LEFT 02
YSRCP 03 01
Others 15 02

Andhra Pradesh

Party Lead(MLA) Won(MLA) Lead(MP) Won(MP)
TDP 104 15
YSRCP 65 08
CONGRESS
JSP
LEFT
Others 06 02

Telangana (Assembly)

Districts TOTAL INC TRS TDP CPM CPI BJP YCP OTHERS
ఆదిలాబాద్ 10 01 07 02
నిజామాబాద్ 09 09
కరీంనగర్ 13 01 12
మెదక్ 10 02 08
రంగారెడ్డి 14 02 04 07 01
హైదరాబాద్ 15 01 03 04 07
నల్గొండ 12 05 06 01
వరంగల్ 12 01 08 02 01
ఖమ్మం 10 04 01 01 01 03
మహబూబ్-నగర్ 14 05 07 02

Andhra Pradesh (Assembly)

Districts TOTAL INC TDP CPM CPI BJP YCP JSP OTHERS
శ్రీకాకుళం 10 08 02
విజయనగరం 09 06 03
విశాఖ 15 11 01 03
తూర్పుగోదావరి 19 12 01 05 01(IND)
పశ్చిమ గోదావరి 15 14 01
కృష్ణ 16 11 01 04
గుంటూరు 17 12 05
ప్రకాశం 12 05 06 01(Navodayam Party)
నెల్లూరు 10 03 07
కడప 10 01 09
కర్నూలు 14 03 11
అనంతపురం 14 12 02
చిత్తూరు 14 06 08

టిడిపి ఖాతాలో పది జడ్పీ చైర్మన్ పదవులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జడ్పీ చైర్మన్ ఎన్నికలో టిడిపి హావా కొనసాగించింది. పది జడ్పీ చైర్మన్ స్థానాలను ఎగురేసుకపోయింది. తుది ఫలితాలు వెలువడే సరికి వైసిపి ఒక్క జిల్లాతో, కాంఎగ్రస్ పత్తా లేకుండా పోయింది.
టిడిపి జోరు..
సార్వత్రిక ఎన్నికల్లో మొదలైన టిడిపి జోరు స్థానిక ఎన్నికల్లో కొనసాగించింది. ఎంపిటిసి ఎన్నికలోనూ అత్యధిక అధ్యక్ష పీఠాలను కైవసం చేసుకున్న టిడిపి జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఎదురులేకుండా పోయింది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జగన్ పార్టీ సొంతం చేసుకుంది. గూడురు రవి చైర్మన్ గా ఎన్నిక కాగా జె.సుబ్బారెడ్డి వైస్ చైర్మన్ గా గెలుపొందారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఒక్క జడ్పీని సైతం దక్కించుకోలేక పోయింది.
జడ్పీ చైర్మన్ లు వీరే...
ఉత్తరాంధ్రలో సత్తా చాటుతున్న టిడిపి జడ్పీ చైర్మన్ ఎన్నికల్లోనూ ప్రాబల్యాన్ని చాటుకుంది. శ్రీకాకుళం జడ్పీ చైర్మన్‌గా చౌదరి ధనలక్ష్మి, విజయనగరం జడ్పీ చైర్మన్‌గా శోభాస్వాతి రాణి, విశాఖపట్నం చైర్మన్‌గా లాలం భవాని ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జడ్పీ చైర్మన్‌గా నామన రాంబాబు, పశ్చిమగోదావరి చైర్మన్‌గా ముళ్లపూడి బాపిరాజు, కృష్ణా జిల్లా చైర్మన్‌గా గద్దె అనురాధ విజయం సాధించారు. గుంటూరు జిల్లా నుంచి షేక్ జానీమూన్‌, చిత్తూరు జిల్లా నుంచి ఎస్.గీర్వాణి చైర్మన్లుగా గెలుపొందారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగిన భూమా..
కర్నూల్ జడ్పీటిసి ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి ఎక్కువ స్థానాలు సాధించినా చివరకు చైర్మన్ పదవి మాత్రం టిడిపికే దక్కింది. ఒకానొక సమయంలో వైసిపి ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు టిడిపికి చెందిన రాజశేఖర్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతపురం జడ్పీ చైర్మన్‌గా టిడిపికి చెందిన దూదేకుల చమన్‌ గెలుపొందారు.
వాయిదా పడిన నెల్లూరు, ప్రకాశం జిల్లా..
చివరి వరకు నెల్లూరు, ప్రకాశం జడ్పీటిసి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగినా ఫైనల్‌గా వాయిదా పడ్డాయి. ప్రకాశం జడ్పీ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టిడిపికి చెందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైసిపికి చెందిన అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌ దాడి చేశారనే వార్తతో రగడ మొదలైంది. టిడిపి కార్యకర్తలు హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు.

ఏపీ..కార్పొరేషన్..మున్సిపాల్టీల విజేతలు.. 1

ఆంధ్రప్రదేశ్ లో ఏడు కార్పొరేషన్లు..92 మున్సిపాల్టీల ఛైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టిడిపి - వైసిపి పార్టీలు ఛైర్మన్ స్థానాలు కైవసం చేసుకున్నాయి.
జిల్లా  అభ్యర్థి పేరు  పార్టీ పేరు
శ్రీకాకుళం చిలకా రాజ్యలక్ష్మి  వైసిపి
ఆముదాల వలస    టిడిపి
బొబ్బిలి మున్సిపాల్టీ    టిడిపి
రాజమండ్రి మేయర్ రజనీ శేషసాయి టిడిపి
రాజమండ్రి డిప్యూటి మేయర్  వాసిరెడ్డి రాంబాబు  
అమలాపురం  ఏళ్ల మల్లేశ్వరరావు  
తుని  దినకంటి సత్యనారాయణ  
మండపేట చొండ్రు శ్రీహరిప్రసాద్  
పెద్దాపురం  రాజ సూరిబాబు  టిడిపి
సామర్లకోట    టిడిపి
విజయవాడ మేయర్  కోనేరు శ్రీధర్ టిడిపి
డిప్యూటి మేయర్  గోగుల రమణ  
నూజివీడు మున్సిపాల్టీ  బసవ రేవతి  వైసిపి
న్యూజివీడు వైస్ ఛైర్మన్  అన్నె మమత  
కడప మేయర్  కె.సురేష్ బాబు  వైసిపి
పులివెందుల మున్సిపాల్టీ  వైఎస్ ప్రమీలమ్మ  వైసిపి
ఎర్రగుంట్ల మున్సిపాల్టీ  ముసలయ్య  వైసిపి
పుంగనూరు    వైసిపి
నగరి  కె.జె.శాంతి  వైసిపి
నందికొట్కూరు  కరువ సుబ్బమ్మ  వైసిపి
గిద్దలూరు  వెంకట సుబ్బమ్మ  వైసిపి

జడ్పీఛైర్మన్ ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట.. Telangana

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నా తెలంగాణాలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నికల్లో మహిళలకు సముచిత స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఏడు జడ్పీ ఛైర్మన్ల ఎన్నికల్లో నలుగురు మహిళలకు అవకాశం దక్కింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కారణంగా తెలంగాణాలోని మెజార్టీ జిల్లాల్లో జడ్పీ ఛైర్ పర్సన్ల స్థానాలు మహిళలకు సగానికి పైగా దక్కాయి.
  రిజర్వేషన్లకు అనుగుణంగా సగం స్థానాలు కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలు మహిళలకు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా జనరల్ స్థానమే అయినా టీఆర్ఎస్ పార్టీ మహిళా నేతనే ఛైర్ పర్సన్ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆ పార్టీ తరపున కరీంగనర్ నుంచి -తుల ఉమ , ఆదిలాబాద్ -శోభారాణి, వరంగల్-గద్దల పద్మ, మెదక్-రాజమణి జడ్పీ చైర్ పర్సన్ లుగా ఎన్నికయ్యారు.
రంగారెడ్డి జడ్పీ ఎన్నిక 13 కి వాయిదా..
  
రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఈ నెల 13 కు వాయిదా పడడంతో రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డిని టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని నిర్ణయించింది.ఈ స్థానంపై ఉత్కంఠగా ఉన్నా ఖచ్చితంగా టీఆర్ఎస్ కే జడ్పీ పీఠం దక్కుతుందనే ధీమా నేతల్లో వ్యక్తం అవుతోంది.
 మరోవైపు రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ జడ్పీటీసీగా విజయం సాధించిన జ్యోతి టీఆర్ఎస్ గూటికి చేరడంతో జిల్లా పరిషత్ లో పార్టీ బలం మరింత పెరిగింది. కాంగ్రెస్, టీడీపీ నుంచి మరికొంత మంది జడ్పీటీసీలు టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది.